ముందుమాట

ముందుమాట

"పలికెంచెడివాడు రామభద్రుడట" అని పోతన వంటి మహానుభావుడే వినమ్రతతో పలికెను. సృజియించే శక్తి భగవంతునికే ఉన్నది. జీవులు నిమిత్తమాత్రులు. ప్రతిభ ఎవరిచే ప్రదర్శితమైనా, నిజమునకు అది వారిచే ప్రకటితమయిన భగవద్విభూతి గా తెలుసుకొనవలెను.ఏ కళాకారుని యొక్క కళ గాని, శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణ గాని వారిద్వారా ప్రకటితమయినవే గాని వారి సృష్టి గాదు. "మత్తస్మృతిజ్ఞానమపోహనం చ" అని శ్రీ కృష్ణభగవానుని గీతోక్తి. కావునా, నా రచనలకు కర్త భగవానుడే అని సత్యమును ముందుగనే ప్రకటించుచున్నాడను.
"చిలుకపలుకులొలుకు రీతి పలికింతువు నా చేతను,
చిలుకగ మరి కృతిపై కృతి నడిపింతువు నా చేతిని,
తలపులు మొలుపుచు నా మతి సృజియింపనీవె ప్రతి కైతను,
తెలిసియు సంగతి శ్రీపతి, నే కర్తగనెటు తలతును?"


*************

Saturday, August 25, 2007

A song made in distress!

This song was addressed to Lord Rama. The day on which I wrote it happened to be the holy day 'శ్రీ రామ నవమి'

(ప.) రామా రామా! పరంధామా శ్యామా! .........[2]

(అ.ప.) తెలియగ నీ మహిమ, అల్పుడనౌ నా తరమా!
విన్నపమే వినుమా, ఓ కంటను నను గనుమా !! ..................................//రామా రామా//



(చ-1) కలతల జీవనమా, అంతే ఎఱుగని రణమా!
ఆ విధి పనితనమా, సుడి తిరిగే సాగరమా!.....[2]
తీరని చింతల జ్వరమా...ఆ...ఆ...ఆ..//తీరని// తరిగే దారిడుమా!!..........//రామా రామా//

(చ-2) మనసొక వానరమా, అలుపెఱుగని వారువమా!
కోదండపు శరమా, ఎవరెఱుగని అబ్బురమా!........[2]
అది తెలియద నిగ్రహమా....ఆ....ఆ...ఆ...//అది// క్షణమైనా నిలుమా!!.....//రామా రామా//

(చ-3) తొలి చూపిన ప్రేమ, కరిగెను క్షణభంగురమా!
పూజలు నిష్ఫలమా, కృత కర్మంబుల ఫలమా!.....[2]
నీ లీలలు నా వశమా...ఆ...ఆ...ఆ...//నీ లీలలు// నీ దాసుడను సుమా!!....//రామా రామా//

No comments: