skip to main |
skip to sidebar
ముందుమాట
ముందుమాట
"పలికెంచెడివాడు రామభద్రుడట" అని పోతన వంటి మహానుభావుడే వినమ్రతతో పలికెను. సృజియించే శక్తి భగవంతునికే ఉన్నది. జీవులు నిమిత్తమాత్రులు. ప్రతిభ ఎవరిచే ప్రదర్శితమైనా, నిజమునకు అది వారిచే ప్రకటితమయిన భగవద్విభూతి గా తెలుసుకొనవలెను.ఏ కళాకారుని యొక్క కళ గాని, శాస్త్రవేత్త యొక్క ఆవిష్కరణ గాని వారిద్వారా ప్రకటితమయినవే గాని వారి సృష్టి గాదు. "మత్తస్మృతిజ్ఞానమపోహనం చ" అని శ్రీ కృష్ణభగవానుని గీతోక్తి. కావునా, నా రచనలకు కర్త భగవానుడే అని సత్యమును ముందుగనే ప్రకటించుచున్నాడను."చిలుకపలుకులొలుకు రీతి పలికింతువు నా చేతను,
చిలుకగ మరి కృతిపై కృతి నడిపింతువు నా చేతిని,
తలపులు మొలుపుచు నా మతి సృజియింపనీవె ప్రతి కైతను,
తెలిసియు సంగతి శ్రీపతి, నే కర్తగనెటు తలతును?"
*************
It's our own actions we reap!
Sometimes, we are put to sorrow or joy, by others’ actions. Thus, though apparently it seems that others are the cause of our lot, actually it is not so. We reap the fruits of our own actions. Every birth we take is to enjoy the fruit of certain portion of our accumulated previous deeds (karma) known as Praarabda. Hence, we should not consider those who cause suffering to us as tormenters.
ఒరులెవరు కారు సరి కారణము ఈ ధరణిఁ నరుల హృది
హరియింప మోదమెద రగిలింప ఖేదారణిన్. పురజన్మ
కరణములె పరావర్త కిరణములై ప్రారబ్దశరములవగా పరమైన ఈ
వివరమెఱుగు స్థిరవరులెవరు పరులనిల అరులవలె తలపోతురే !
Meaning:
In this world, others are not the real cause for one’s happiness or sorrow. It is one’s own deeds of the previous birth that bounce back to him like reflected rays and become the arrows of “praarabda”. The wise who realize this noble truth would never look upon anyone as enemy.
No comments:
Post a Comment