బాలాత్రిపురసుందరీ....మా బాలా వేదన తీర్చవే... //2//
లీలాకేళి ముజ్జగాల సుపాలించే - (2) మముగన్నతల్లీ మాపాలికల్పవల్లి.. //బాలా//
తరాల తరాల మా పరివారమెల్ల - (2) పరాశక్తి స్థిరభక్తి నిను కొల్చినామె,
ఇహాన పరాన వరాలిచ్చి దఱిజేర్చు, ఆధారమీవని నెఱనమ్మినామె ;
మొఱాలించవే... (2) మరాళీ మాధవుచెల్లి //బాలా//
ముల్లోకజననీ ముక్కంటి ముద్దులరాణి --(2) మీ చిన్నిపాపలము దయచూడుమమ్మా,
భవానీ శివానీ భవ్యఫలదాయిని, మా చిన్న పాపముల మదినెంచకమ్మా;
కృపన్ చూడవే.... (2) తపించేము ప్రణమిల్లి //బాలా//
You can download the mp3 audio of this song at this link:
http://www.filefactory.com/file/ce9b15e/n/Baalaatripurasundaree.(mahesh)..mp3
Sunday, October 23, 2011
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బాల త్రిపుర సుందరీ మీ బాల వేదన తీర్చి మిమ్ములను కటాక్షించు గాక
పరాన వరాలిచ్చి ..అంటే ముక్తి ని ప్రసాదించడమ?
Post a Comment